భూపాలపల్లి మండలంలో ప్రభుత్వ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమానితులను విచారిస్తున్నాము. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, వారి గత నేరచరిత్ర ఆధారంగా అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం అని భూపాలపల్లి పట్టణ సీఐ నరేష్ కుమార్ గారు తెలిపారు.