అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తోంది. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని ఈ ఏడాది కాళేశ్వరంలో చూడవచ్చు. దీనితో రెండో దేశంలో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది.